జగన్‌కు పోటీ ఇస్తామా, కిరణ్‌ను ఆరా తీసిన కాంగ్రెసు అధిష్టానం

వైయస్ జగన్‌ను సాధ్యమైనంత వరకు ఎదుర్కునే ప్రయత్నం చేయాలని, ఓడించలేకపోయినా మెజారిటీ సాధ్యమైనంత మేర తగ్గించేలా వ్యవహరించాలని ఆయన కిరణ్ కుమార్ రెడ్డికి సూచించినట్లు చెబుతున్నారు. గట్టిగా పట్టు పడితే పులివెందుల శాసనసభ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న వైయస్ వివేకానంద రెడ్డి మంత్రి పదవికి చేసిన రాజీనామాను ఆమోదించాలని కూడా సూచించినట్లు తెలుస్తోంది. వివేకానంద రెడ్డి రాజీనామాను ఆమోదిస్తే కడప లోకసభ స్థానంలో పోటీ చేస్తున్న డిఎల్ రవీంద్రా రెడ్డి చేత కూడా రాజీనామా చేయించాలని చెప్పినట్లు తెలుస్తోంది. అవసరమైతే తిరిగి రవీంద్రా రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవచ్చునని అహ్మద్ పటేల్ చెప్పినట్లు సమాచారం.
కాగా, పులివెందులలో ఓడిపోతే వైయస్ వివేకానంద రెడ్డిని రాజ్యసభకు ఎన్నికునే అంశం కూడా చర్చకు వచ్చింది. వివేకానంద రెడ్డిని ఎమ్మెల్సీగా తీసుకుని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవడమా, రాజ్యసభకు ఎన్నిక చేసుకోవడమా అనే విషయంపై మరింతగా ఆలోచించాలని చెప్పినట్లు తెలుస్తోంది.