వైయస్ వారసుడు జగన్ అనేది ఎప్పుడో రుజువైంది: భూమన కరుణాకర్ రెడ్డి
Districts
oi-Srinivas G
By Srinivas
|
కడప: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి రాజకీయ వారసుడిగా మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అని ఎప్పుడో రుజువు అయిందని తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఓ టీవీ ఛానల్ ముఖాముఖిలో చెప్పారు. వైయస్ ఆశయాలు, లక్ష్యాలు నెరవేరాలంటే జగన్‌కు ఒక్కరికే సాధ్యమని రాష్ట్ర ప్రజానీకం గట్టి నమ్మకంతో ఉన్నారన్నారు. రాష్ట్ర ప్రజలలాగే కడప, పులివెందుల ప్రజలు కూడా వైయస్ ఆశయ సాధన కోసం జగన్‌ను, విజయమ్మను ఇంతకుముందు కంటే అధిక మెజార్టీతో గెలిపించాలనే కృతనిశ్చయంతో ఉన్నాయని చెప్పారు.
విజయమ్మ ఎన్నికల ప్రచారానికి తిరుగుతుంటే ప్రజలే ఆమెను తిరగవద్దని సూచిస్తున్నారని, మేమంతా మీ వెంట ఉండగా తిరగడం ఎందుకని అంటున్నారని, అయితే ఎప్పుడూ ప్రజలలో ఉండే ఆ కుటుంబం మాత్రం ప్రజల వద్దకు వెళుతుందని అన్నారు. జగన్, విజయమ్మలను భారీ ఆధిక్యంతో గెలిపించాల్సిన బాధ్యత తమపై ఉన్నదని ఓటర్లు భావిస్తున్నారని చెప్పారు. కాంగ్రెసు పార్టీ మాత్రం ఎన్నికల సందర్భంగా పైశాచికంగా ప్రవర్తిస్తుందని అన్నారు.
Ex TTD chairman Bhumana Karunakar Reddy said that late YS Rajasekhar Reddy heir was already confirmed. He blamed Congress and AICC president Sonia Gandhi attitude in by-pole.
Story first published: Thursday, April 14, 2011, 10:38 [IST]