పరిటాల రవి కేసును మళ్లీ విచారణ జరిపించాలి: కోడెల

పరిటాల రవి హత్యలో జగన్ హస్తం కోణంలో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రులు, శాసనసభ్యులు అందరూ కడప, పులివెందుల ఉప ఎన్నికల కోసం ఒకే జిల్లాలో తిష్ట వేయడం వలన రాష్ట్రంలో పాలన పూర్తిగా స్తంభించి పోయిందన్నారు. ప్రజల గురించి పట్టించుకోవాల్సిన మంత్రులు ఒకే జిల్లాకు పరిమితం అయి పోయారన్నారు. వైయస్ జగన్ తన అవినీతి సొమ్ముతో ఉప ఎన్నికలలో గెలుపొందాలని భావిస్తున్నారన్నారు. ఇప్పటికే జగన్ 100 కోట్ల రూపాయలను కడపకు తరలించారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications