నిలకడగా సత్య సాయిబాబా ఆరోగ్యం, వెంటిలేటర్ ద్వారా శ్వాస
State
oi-Pratapreddy
By Pratap
|
అనంతపురం: పుట్టపర్తి సత్య సాయిబాబా ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు శనివారం ఉదయం ప్రకటించారు. సత్య సాయిబాబా అన్ని అవయవాలు మెరుగు పడుతున్నాయని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి డైరెక్టర్ సఫాయా చెప్పారు. అయితే వెంటిలేటర్ ద్వారానే శ్వాసను అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. సిఆర్ఆర్‌టీ ద్వారా డయాలసిస్ కొనసాగిస్తున్నట్లు ఆయన తెలిపారు. సత్య సాయిబాబాకు 24 గంటలు వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.
గత నెల 28వ తేదీన సత్య సాయిబాబాను ప్రశాంతి నిలయంలోని సూపర్ స్పెషాలిటీ అస్పత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి బాబా ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు ప్రకటిస్తూ వస్తున్నారు. బాబా ఆరోగ్యంపై భక్తులు ఆందోళన చెందుతున్నారు. సత్య సాయిబాబా ఆరోగ్యంపై వైద్యులు చేస్తున్న ప్రకటనలపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.