హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ ఆస్తులే తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీల అస్త్రాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్‌: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తన అఫిడవిట్‌లో చూపించిన ఆస్తుల విలువపై కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపణలు సంధిస్తున్నారు. దేశ రాజకీయ నాయకుల్లోనే అత్యంత ధనికుడిగా ముందుకు వచ్చిన ఆయన ఆస్తులను ఉప ఎన్నికల్లో ప్రచారాస్త్రం చేసుకుంటున్నారు. కడప ఉప ఎన్నికల్లో తప్పుడు ఆస్తి వివరాలతో నామినేషన్‌ వేసిన జగన్‌పై అనర్హత వేటు వేయాలని తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ఆయన అన్నారు.

అఫిడవిట్‌ ద్వారా జగన్‌ తన నల్లధనాన్ని లెక్కల్లో చూపించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇళ్లు, స్థలాల వంటి స్థిరాస్థుల్ని మార్కెట్‌ విలువ ప్రకారం చూపించకుండా ఎన్నికల సంఘాన్ని, ప్రజల్నీ మోసం చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాదులోని బంజారాహిల్స్‌లోని వైయస్ జగన్ ఇంటి విలువ 18 కోట్ల రూపాయలు ఉంటుందని, అలాగే భారతి సిమెంట్స్ విలువ 2 వేల కోట్ల రూపాయలు ఉంటుందని ఆయన చెప్పారు. తన ఆస్తులపై విచారణకు సిద్ధంగా ఉన్నానని, జగన్ తన ఆస్తులపై విచారణకు సిద్ధపడాలని ఆయన అన్నారు.

ఎన్నికల సంఘానికి జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన అఫిడవిట్‌లోని ఆస్తుల వివరాలపై ప్రజల్లో అనేక అనుమానాలున్నందున తక్షణం వాటిపై వివరణ ఇవ్వాలని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధికార ప్రతినిధి తులసిరెడ్డి అన్నారు. అతితక్కువ కాలంలో వేల కోట్ల రూపాయలను ఎలా దోచుకోవచ్చన్న విషయం జగన్‌ అక్రమార్జనతో నిరూపితమైందని ఆయన విమర్శించారు. కడప ఉప ఎన్నికలు కుబేర, కుచేలుల మధ్య జరుగుతున్న పోరుగా అభివర్ణించారు. ప్రజల సొమ్ము దోచుకున్న జగన్‌కు ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. బెంగళూర్‌లోని రాజభవనం, తదితర ఆస్తులు తనవి కావని జగన్ చెప్పగలరా అని ఆయన ప్రశ్నించారు.

English summary
TDP and Congress parties targeted YSR Congress loksabha candidate YS Jagan's properties. TDP MP Nama Nageswara Rao demanded EC disqualify YS Jagan for election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X