చర్యలకు సిద్ధంగా ఉన్నాను, వివేకాను అలా చూడాలని ఉంది: ఆదినారాయణ

Adinarayana Reddy
కడప: కాంగ్రెసు పార్టీ తనపై చర్యలు తీసుకోవడానికి సిద్ధమైతే తాను అందుకు సిద్ధంగా ఉన్నానని మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం జమ్మలమడుగు శాసనసభ్యుడు ఆదినారాయణరెడ్డి ఆదివారం ఓ టీవీ కార్యక్రమంలో చెప్పారు. పార్టీ తనను అనర్హుడినా ప్రకటించినా తనను గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. అయినా అనర్హులం మేం కాదని చెప్పారు. అసలైన అనర్హులు కాంగ్రెసు పార్టీకి చెందిన వారే అని అన్నారు.

కడప, పులివెందులలో జగన్, విజయమ్మలు భారీ ఆధిక్యంతో గెలుస్తారని అన్నారు. జగన్ 3 లక్షల ఆధిక్యంతో గెలుపొందుతారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెసు పార్టీలో ఉన్న వైయస్ వివేకానందరెడ్డిని వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీలో ఉన్నత స్థాయిలో చూడాలని ఉందని అన్నారు. వివేకాను అలా చూస్తే తనకు సంతోషంగా ఉంటుందన్నారు. మంత్రి డిఎల్ బయట పెట్టని ఆస్తులు చూపిస్తే తాను సవాల్‌కు సిద్ధమని ప్రకటించారు.

కాగా తాను వైయస్ జగన్‌కు చెందిన వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీలోనే ఉన్నానని మాజీ శాసనసభ్యుడు ఎంవి రమణారెడ్డి వేరుగా చెప్పారు. జగన్ విజయం కోసం కడప జిల్లాలో శాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+