హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ వెంట వెళ్తున్నఎమ్‌ఎల్‌ఎపై చర్యలు తీసుకోనున్న చిరంజీవి

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టి అధ్యక్షడు చిరంజీవి కూడా జగన్ వెంట వెళ్తున్నటువంటి ఎమ్‌ఎల్‌ఎలపై చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించినట్లు సమాచారం. పిఆర్‌పి ఎమ్‌ఎల్‌ఎలు అయినటువంటి శోభా నాగిరెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి ఇద్దరూ జగన్ వెంట వెళ్తున్న విషయం తెలిసిందే. దీంతో పిఆర్పిలో పెద్దలు వీరిద్దరిపై డిప్యూటి స్పీకర్‌కి ఫిర్యాదు చేయనున్నారు. ఈ విషయాన్ని పిఆర్పి పార్టీ విప్ వంగా గీత్ ధృవీకరించారు. ఇది మాత్రమే కాకుండా పిఆర్పిలో మరో ముఖ్యనేత గంటా శ్రీనివాసరావు కాడా పిఆర్పి జెండా పెట్టుకోని గెలిచి ఇప్పుడు పిఆర్పి పార్టీని కాదని జగన్‌కి సోపర్టు చేయడం పద్దతి కాదన్నారు.

లేకుండే వైయస్ జగన్ మాదిరి కాంగ్రెస్‌కి రాజీనామా చేసి సొంతంగా వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద గెలవాలని సూచించారు. వంగా గీత డిప్యూటి స్పీకర్‌కి వీరిద్దరి మీద రేపు పార్టీ ఉల్లంఘనలు క్రింద ఫిర్యాదు చేయనున్నారు. ఇది ఇలా ఉంటే కాంగ్రెస్ పార్టీ నిబంధనలు అతిక్రమించి జగన్ వెంట వెళ్తున్నటువంటి జగన్ వర్గం ఎమ్‌ఎల్‌ఎలపై సరైన సమయంలో స్పందిస్తామని చెబుతూ వచ్చిన కాంగ్రెస్‌ నేతలు వేటుకు ఇదే సరైన సమయంగా భావించారు. జగన్‌ వర్గం ఎమ్మెల్యేలపై వేటు వేయాలని నిర్ణయించారు. జగన్‌ పార్టీకి మద్దతిస్తున్న ఐదుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బుధవారం డిప్యూటీ స్పీకరు నాదెండ్ల మనోహర్‌కు ఫిర్యాదు చేయనున్నారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, కడప జిల్లా ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డిలపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరనున్నారు.

అధిష్ఠానం అనుమతితో ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌లు ఈ ఫిర్యాదు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ చీఫ్‌ విప్‌ మల్లు భట్టి విక్రమార్క, విప్‌ కొండ్రు మురళి ఫిర్యాదుకు సంబంధించిన కసరత్తు పూర్తి చేశారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఎమ్మెల్యేలపై ఆధారాలను సిద్ధం చేసిన వారు మంగళవారం ముఖ్యమంత్రితో భేటీ అయి చర్చించారు. అనంతరం చీఫ్‌ విప్‌, విప్‌లు డిప్యూటీ స్పీకరుతోనూ భేటీ అయ్యారు. జగన్‌కు అండగా నిలుస్తూ కాంగ్రెస్‌ పార్టీకి నష్టం కలిగిస్తున్న ఎమ్మెల్యేల్లో తొలి దశగా ఐదుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరనున్నారు.

English summary
Allagadda MLA Shobha Nagi Reddy and Banaganapalle MLA Katasani Ram Reddy are all set to be sacked from Praja Rajyam Party for joining hands with former Kadapa MP Y S Jaganmohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X