నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విజయవంతంగా పిఎస్‌ఎల్‌వి ప్రయోగం: కక్ష్యలోకి మూడు ఉపగ్రహాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Satellite
నెల్లూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోట కోట అంతరిక్ష కేంద్రం నుండి బుధవారం నింగికెగిసిన పిఎస్ఎల్‌వి సి 16 వ్యోమ నౌక ప్రయోగం విజయవంతంగా పూర్తయింది. దశలవారిగా లక్ష్యాలను అధిగమించుకుంటూ వెళ్లింది. పిఎస్‌ఎల్‌వి మూడు ఉపగ్రహాలను మోసుకెళ్లింది. నౌక నాలుగు దశలను విజయవంతంగా దాటి మూడూ ఉప గ్రహాలను కక్ష్యలో ప్రవేశ పెట్టింది. కాగా ఈస్రో చైర్మన్ రాధాకృష్ణన్ ఆధ్వర్యంలో ఇది తొలి విజయం. ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రోలో ఆనందం మిన్నంటింది. అందరూ సంబరాలు చేసుకున్నారు. రాధాకృష్ణన్ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. పిఎస్ఎల్‌వి శ్రేణిలో ఇది 18వ ప్రయోగం. కాగా ఈ ప్రయోగంతో చంద్రయాన్-2కు లైన్ క్లియర్ కానుంది.

షార్ కేంద్రంగా 1994 నుండి 17 సార్లు పిఎస్ఎల్‌విని ప్రయోగించగా విజయవంతమైన 16 పర్యోగాల్లో 44 ఉపగ్రహాలను రోదసీలో ప్రవేశ పెట్టింది. ఇప్పటి వరకు కేవలం ఒక్కసారి మాత్రమే విఫలమయింది. పిఎస్‌ఎల్‌వి సి 16 నౌకలో రిసోర్స్ శాట్-2, యూత్ శాట్, ఎక్స్ శాట్ మూడు ఉప గ్రహాలను పిఎస్‌ఎల్‌వి 900 కిలోమీటర్ల ఎత్తున సూర్యావర్తన ధ్రువ కక్ష్యలోకి ప్రవేశ పెడుతుంది. నాలుగు దశల ఈ రాకెట్ ఎత్తు 44 మీటర్లు. తొలిదశ చుట్టూ 6 ఘన ఇంధన స్ట్రాఫాన్ బూస్టర్లు ఉంటాయి. ప్రయోగవేళ దీని బరువు 295 టన్నులు. తొలిదశ బూస్టర్‌లో 139 టన్నుల ఇంధనం నింపారు. రెండు, మూడు దశల్లో 41 టన్నుల ద్రవ, 7.6 టన్నుల ఘన ఇంధనాలను, చివరిదానిలో 2.5 టన్నుల ద్రవ ఇంధనాన్ని నింపారు. ఉప గ్రహాలను 3.2 మీటర్ల వ్యాసంగల ఉష్ణ కవచంలో సురక్షితంగా ఉంచారు. కాగా మంగళవారం ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ నమూనా రాకెట్‌తో శ్రీవారికి ప్రత్యేక పూజలు చేశారు.

English summary
The Polar Satellite Launch Vehicle (PSLV), carrying three satellites, successfully lifted off from Sriharikota on Wednesday. Among the three satellites to be placed into their respective orbits by the rocket includes Indian Space Research Organization's (ISRO) Resource sat-2.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X