త్వరలో మార్కెట్‌లోకి రానున్న నోకియా విండోస్ ఫోన్స్ ఇరగదీశాయ్...!

ఇక మొట్టమొదటి డివైస్ ఎక్స్7 వేరియంట్‌ని కలిగిఉండి విండోస్7 ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్ చేస్తూ నోకియా డబ్ల్యు7గా నామకరణం చేశారు. ఐతే ఇదే ఫైనల్ పేరు అని అనుకోకూడదు. ఈ డివైస్ Qualcomm QSD8250 processorతో పాటు, WVGA display కలిగిఉండి సేమ్ టు సేమ్ నోకియా ఈ7 లాగా ఉంటుందంటున్నారు. అదే విధంగా 8 మెగా ఫిక్సల్ కెమెరాతో పాటు ఆటో ఫోకస్, ఫ్లాష్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇది నోకియా మొట్టమొదటి విండోస్ ఫోన్. దీనిని 2011,Q4లో విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
ఆ తర్వాత నోకియా ఎన్8 వేరియంట్ పోన్. 12మెగా ఫిక్స్ కెమెరా కలిగిఉండి ఓరిజినల్ ఎన్8 పోన్ మాదిరే ఉంటుంది. ఇది నోకియా మొట్టమొదటి డ్యూయల్ కోర్ స్మార్ట్ పోన్. దీనిని 2012,Q1లో విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత నోకియా ఈ6 వేరియంట్. ఈ పోన్‌ని ప్రత్యేకంగా ఎంటర్పైజ్ పోకస్ చేసేవిధంగా రూపోందిచడం జరుగుతుంది. ఈ పోన్ ప్రస్తుతం ఉన్నటువంటి సింబియన్ ఆపరేటింగ్ సిస్టమ్ హార్డ్‌వేర్ కలిగి ఉంటుంది.
ఇలా నోకియా కంపెనీ కేవలం నాలుగు డివైజెస్‌ని మాత్రమే మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. ఇలా నోకియా కంపెనీ తన విండోస్ ఫోన్స్‌ని మార్కెట్‌లోకి విడుదల చేసి రెండవ తరం వేవ్‌ని క్రియేట్ చేయనుంది.












Click it and Unblock the Notifications