మిస్టర్ పర్‌ఫెక్ట్ టిక్కెట్ల కోసం తొక్కిసలాట: ప్రభాస్ అభిమాని మృతి

Kurnool Dist map
కర్నూలు: ప్రభాస్ కథానాయకుడుగా నటించిన మిస్టర్ పర్‌ఫెక్ట్ చిత్రం టిక్కెట్ల కోసం జరిగిన తొక్కిసలాటలో ఓ అభిమాని మృతి చెందిన విషాద సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. ప్రభాస్ నటించిన మిస్టర్ ఫర్‌పెక్ట్ చిత్రం శుక్రవారం విడుదలయింది. అయితే ఈ సందర్భంగా కర్నూలు జిల్లా నంద్యాల రాజ్ టాకీస్ వద్ద భారీగా ప్రభాస్ అభిమానులు ఉదయాన్నే థియేటర్‌కు తరలి వచ్చారు.

అయితే టిక్కెట్ల కౌంటర్ ఓపెన్ అయ్యాక భారీగా తరలి వచ్చిన అభిమానులు టిక్కెట్ల కోసం ఎగబడ్డారు. ఈ సమయంలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో నాగ మద్దిలేటి అనే ప్రభాస్ అభిమాని మృతి చెందినట్లుగా సమాచారం. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా విడుదలవుతున్న మిస్టర్ పర్‌పెక్ట్ చిత్రంపై అభిమానులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రాజు నిర్మించగా, కె.దశరథ్ దర్శకత్వం వహించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+