నలుగురు మంత్రులకు ఇసి నోటీసులు, చర్చిలోకి వెళ్లారని ఆరోపణ
State
oi-Pratapreddy
By Pratap
|
కడప: కడప ఉప ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం సాగిస్తున్న నలుగురు మంత్రులకు ఎన్నికల సంఘం (ఇసి) నోటీసులు జారీ చేసింది. మంత్రులు డిఎల్ రవీంద్రా రెడ్డి, కన్నా లక్ష్మినారాయణ, అహ్మదుల్లా, మాణిక్య వరప్రసాద్, అహ్మదుల్లాలకు ఇసి నోటీసులు జారీ అయ్యాయి. గుడ్ ఫ్రైడే రోజు వారు చర్చిలోకి వెళ్లి ఓటర్లను ప్రభావితం చేశారనే ఆరోపణపై ఈ నోటీసులు జారీ అయ్యాయి. డిఎల్ రవీంద్రా రెడ్డి కాంగ్రెసు తరఫున కడప లోకసభ స్థానానికి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
కడప లోకసభ స్థానంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ను ఓడించడానికి మంత్రులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు సర్వ శక్తులూ ఒడ్డుతున్నారు. ఈ క్రమంలోనే వారు గుడ్ ఫ్రైడే రోజు ఓటర్లను ప్రభావితం చేయడానికి చర్చిలోకి ప్రవేశించారని ఆరోపిస్తున్నారు.