హైదరాబాదులో నరబలి: 9 ఏళ్ల బాలుడి తలపై రాళ్లతో మోది హత్య?

Hyderabad
హైదరాబాద్: రాజధాని నగరం హైదరాబాదులో నరబలికి ప్రయత్నాలు జరిగినట్లుగా తెలుస్తోంది. నేరెడ్‌మెట్‌లోని వినాయక నగర్‌లో ఉంటున్న నాగరాజు తనయుడు రాజుపై వారి ఇంటి పక్కన మూడంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్న ఓ కిరాణా దుకాణ యజమాని నరబలికి పాల్పడ్డట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐదు రోజుల క్రితం ఓ ఉదయాన రక్తపు మడుగులలో పడి ఉన్న రాజును తల్లిదండ్రులు, బంధువులు మహాత్మాగాంధీ హాస్పిటల్‌కు తరలించారు. అయితే ఐదురోజులుగా చికిత్స పొందుతున్న రాజు మంగళవారం ఉదయం మరణించారు. ఈ నెల 20వ తారీఖున తొమ్మిదేళ్ల రాజును తల్లి కిరాణా దుకాణానికి సరుకుల కోసం రాత్రి ఎనిమిది గంటలకు పంపించింది.

ఆ తర్వాత రాజు ఇంటికి రాలేదు. అయితే 21న ఉదయం పక్కన రక్తపు మడుగులో పడి ఉన్నాడు. దీంతో ఆయనను వెంటనే మహాత్మాగాంధీ హాస్పిటల్‌కు తరలించారు. అయితే ఐదు రోజులుగా చికిత్స పొందుతున్న రాజు ఉదయం మరణించాడు. అయితే రాజు తల్లిదండ్రులు ఐదు రోజుల క్రితమే తమ ఇంటి పక్కన ఉన్న భవన యజమాని తన కొడుకును నరబలి ఇవ్వడానికి ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. కిరాణా దుకాణం నడుపుతున్న పక్కన భవనం యజమాని మూడంతస్తుల భవనాన్ని పునర్నిర్మిస్తున్నాడు. ఈ భవనం ఇంకా పూర్తి కాలేదు.

ఇప్పుడు కూడా బాలుడి తల్లిదండ్రులు, బంధువులు నరబలి జరిగిందని పక్కన ఉన్న భవన యజమానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. రాజు నరబలికి కారణం అని అనుమానిస్తున్న ఇంటి యజమానిని, తమ్ముళ్లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే తమకు నరబలి అవసరం లేదని వారు వాదిస్తున్నారు. అయితే ఈ కేసులో రాజు మరణానికి ముందు ఏమైనా చెప్పి ఉంటే ఆధారాలు దొరికేవి. కానీ రాజు నుండి ఎలా జరిగిందనే విషయంపై ఆరా తీయనందువల్ల కేసులో ఎలాంటి పురోగతి లేకుండా పోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+