నోటీసుల వెనుక అదృశ్య శక్తులు: డిఎస్‌కు కొండా సురేఖ లేఖ
Districts
oi-Srinivas G
By Srinivas
|
వరంగల్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గానికి చెందిన కాంగ్రెసు పార్టీ సీనియర్ శాసనసభ్యురాలు కొండా సురేఖ బుధవారం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ పంపిన నోటీసులకు సమాధానం ఇచ్చారు. డిఎస్‌కు ఆమె మూడు పేజీల బహిరంగ లేఖను పంపింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు తాను ఎప్పుడూ పాల్పడలేదని ఆమె స్పష్టం చేశారు. ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ పార్టీ ప్రతిష్ట దెబ్బతినేలా తాను వ్యవహరించలేదని చెప్పారు. కేవలం మీడియాలో వచ్చిన వార్తలను మాత్రమే పరిగణలోకి తీసుకొని తనపై చర్యలు తీసుకోవడానికి నాపై సిఫారసు చేసినట్లుగా కనిపిస్తోందని అన్నారు.
తనకు నోటీసులు ఇవ్వడం వెనుక అదృశ్య శక్తులు ఉన్నట్టుగా కనిపిస్తోందని వారెవరో తెలియాల్సిన అవసరం ఉందని అన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడనందున తనకు ఇచ్చిన నోటీసులను వెనక్కి తీసుకోవాలని ఆమె కోరారు. తెలంగాణ పార్లమెంటు సభ్యులు తెలంగాణ కోసం పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని వారికి ఇవ్వని నోటీసులు తనకు ఎలా ఇస్తారని ఆమె ప్రశ్నించారు.
Ex MP YS Jaganmohan Reddy camp Congress senior MLA Konda Surekha replied to PCC president D Srinivas notice today. She accused that to take consider media news.
Story first published: Wednesday, April 27, 2011, 16:02 [IST]