కుల్వంత్ హాల్ అనే పేరు ఎలా వచ్చింది, ఇంతకీ కుల్వంత్ ఎవరు?
State
oi-Pratapreddy
By Pratap
|
పుట్టపర్తి : పుట్టపర్తి సత్య సాయి బాబా పార్ధివ దేహాన్ని ప్రశాంతి నిలయంలోని కుల్వంత్ హాల్లో సమాధి చేస్తారని వార్తలు వెలువడిన వెంటనే కుల్వంత్ అంటే ఏమిటి, ఆ పేరు ఎలా వచ్చిందనే ఆసక్తి ప్రారంభమైంది. సాయి కుల్వంత్ అలియాస్ కుల్వంత్ రాయ్ న్యూఢిల్లీకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త. ఔరంగజేబ్ లేన్ నివాసి అయిన కుల్వంత్ రాయ్ న్యూఢిల్లీలోని శ్రీ సత్య సాయి సంస్థ రాష్ట్రాధ్యక్షుడిగా పనిచేసేవారు. సత్య సాయి బాబా భక్తుడైన కుల్వంత్ 1993 - 94లో బాబా ప్రవచనాలు ఇవ్వడానికి, భక్తులను దీవించడానికి ప్రశాంతి నిలయం ఆవరణలో అద్భుతమైన హాల్‌ను నిర్మించారు.
ఆ హాల్ నిర్మాణం పూర్తయిన తర్వాత దానికి సత్య సాయి బాబా సాయి కుల్వంత్ అని పేరు పెట్టారు. ఢిల్లీలో ఉన్నప్పుడు సత్య సాయి బాబా కుల్వంత్ నివాసంలోనే ఉండేవారు. ఆ తర్వాత 11 ఏళ్లకు సత్య సాయి బాబా 2010 ఏప్రిల్ 9వ తేదీన కుల్వంత్ ఇంటికి వెళ్లారు. కుల్వంత్ కుటుంబ సభ్యులను దీవించి అక్కడే రాత్రి భోజనం చేశారు. ప్రస్తుతం కుల్వంత్ ఓ వ్యాధితో బాధపడుతున్నట్లు చెబుతున్నారు.
Sai Kulwant, alias Kulwant Rai, is an industrialist from New Delhi. A resident of Aurangzeb Lane, he was formerly state president of the Sri Sathya Sai Organization of New Delhi. An ardent devotee of Sai Baba, in 1993-94, he built a magnificent hall in the Prashanti Nilayam premises, where Sai Baba gave discourses and blessed devotees.
Story first published: Wednesday, April 27, 2011, 17:18 [IST]