కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మీడియాపై భగ్గుమన్న వైయస్ జగన్, వక్రీకరించారని ఆవేదన

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
కడప: మీడియా వార్తలపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప లోకసభ స్థానం అభ్యర్థి వైయస్ జగన్మోహన్ రెడ్డి మీడియాపై భగ్గుమన్నారు. మీడియాలోని ఓ వర్గం తన మాటలను వక్రీకరిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో బిజెపితో పొత్తు పెట్టుకోవాల్సి వస్తే తాను ముస్లింలకు పది శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తానని చెప్పిన మాటలను ఆధారం చేసుకుని వైయస్ జగన్ బిజెపితో పొత్తు పెట్టుకుంటారని మీడియా వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యానంపై జగన్ బుధవారం సాయంత్రం స్పందించారు.

బిజెపితో పొత్తు పెట్టుకోనని పదే పదే తాను చెబుతూ వస్తున్నానని, అయినా మీడియా అటువంటి వార్తలను ప్రసారం చేసిందని ఆయన అన్నారు. ముస్లింలకు మంచి జరగాలన్నదే తన ఆలోచన ఆయన చెప్పారు. బిజెపితో పొత్తు ఉండదనే విషయాన్ని తాను స్పష్టంగానే చెబుతున్నానని ఆయన అన్నారు. ముస్లింలు తన వెంట వస్తున్నారని కాంగ్రెసు పార్టీకి వణుకు పుడుతోందని ఆయన వ్యాఖ్యానించారు.

English summary
YSR Congress party leader YS Jagan condemned media reports about his alliance with BJP. He clarified that there will be no alliance with BJP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X