• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

తమిళ ముఖ్యమంత్రి కరుణానిధి కూతురు కనిమొళి ప్రయాణం

By Pratap
|

Kanimozhi
చెన్నై: తన 43 ఏళ్ల ప్రయాణంలో ఎక్కువగా కనిమొళి తన తండ్రి కరుణానిధి సాహిత్య వారసురాలిగా నిలబడడానికే ప్రయత్నించారు. తన సవతి తల్లి సోదరులు తండ్రి రాజకీయ వారసత్వం కోసం పోరాడుతుండగా ఆమె సాహిత్య వారసత్వం స్వీకరించడానికి ఎక్కువగా ప్రయత్నించారు. విద్యావంతురాలు, మంచి వక్త అయిన కనిమొళి 2007లో రాజకీయాల్లోకి ప్రవేశించి తన సోదరుల వారసత్వ పోరులో చేరిపోయారు. అయితే, పరిణామాలు సజావుగా సాగడం లేదు.

తమ పిల్లలను తమ వారసులుగా నిలబెట్టేందుకు సెలిబ్రిటీలు ప్రయత్నించడం భారతదేశంలో అతి సాధారణమైన విషయంగానే పరిగణిస్తున్నారు. రాజకీయాలు, క్రీడలు ఏదైనా కావచ్చు, అది జరుగుతూనే ఉన్నది. తమ పిల్లలను, కూతురు, కుమారుడు ఎవరైన కావచ్చు, తమ రాజకీయ వారసులుగా వారిని నిలబెట్టేందుకు అనన్ని పార్టీల్లో ప్రయత్నాలు సాగుతుండడం మామూలు విషయం. ఇది చర్చనీయాంశం కూడా కాదు.

ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులు, ముఖ్యంగా ముఖ్యమంత్రులు తమ పిల్లలను రాజకీయాల్లోకి తెచ్చి, రాజకీయ నాయకులుగా నిలబెట్టే పనిని క్రమంగా చేస్తూ పోతుంటారు. కేరళ ముఖ్యమంత్రి కె. కరుణాకరన్ ఈ విషయంలో ఫలితం సాధించలేకపోయారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి దేవెగౌడ తన కుమారుడు కుమారస్వామిని తన వారసుడిగా నిలబెట్టగలిగారు. కరుణానిధి ఆ ప్రయత్నాలే చేస్తున్నారు.

అయితే, కరుణానిధి ముగ్గురు భార్యలు, ఆరుగురు సంతానం గొడవలో చిక్కుకుపోయారు. వారిలో కరుణానిధి ముగ్గురు సంతానం తమిళనాడు రాజకీయాల్లో పెద్ద పాత్రను ఆశిస్తున్నారు. వారిలో కనిమొళి ఒక్కరు. 2007లో ఆమె కరుణానిధి వారసత్వ పోరులోకి దిగారు. మారన్‌ల (దయానిధి, కళానిధి) మధ్య చీలిక నేపథ్యం దీనికి ఉంది. న్యూఢిల్లీలో పార్టీ వ్యవహారాలపై మాట్లాడేందుకు మంచి ఆంగ్ల భాష వచ్చిన అధికార ప్రతినిధి కావాల్సి వచ్చింది. దీంతో కనిమొళి పేరు ఏకగ్రీవంగా ముందుకు వచ్చింది.

అప్పటి నుంచి ద్రవిడియన్ పార్టీ థింక్ ట్యాంక్‌లో ఆమె చేరిపోయారు. ఈ నాలుగేళ్ల కాలంలో కనిమొళి తన తండ్రి సాహిత్య వారసురాలిగా కాకుండా రాజకీయ వారసురాలిగా నిలబడడానికే ప్రయత్నాలు చేశారని చెప్పవచ్చు. తమిళ సాహిత్య ఉత్సవాల నిర్వహణ లేదా తమిళనాడు మహిళా సమస్యల వ్యవహారం - ఏదైనా కనిమొళి రాజకీయ వారసత్వం కోసం చేసిన ప్రయత్నాల్లో భాగమనే చెప్పాలి. ఆమె పార్టీ నిర్ణయాలను ప్రభావితం చేసే స్థాయికి చేరుకున్నారు - వాటిలో అత్యంత ముఖ్యమైంది - అవినీతి ఆరోపణలు ఉన్నప్పటికీ రెండోసారి రాజాకు కేంద్ర మంత్రి పదవి ఇప్పించడం. దీంతో ఇప్పుడు కనిమొళిని బలపరిచి, ఆమె కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితిలో పార్టీ పడింది.

తమిళనాడు రాజకీయాల్లో ప్రవేశించిన జయలలిత, కనిమొళి తమ నాయత్వాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించడం చూస్తాం. పురుషాధిపత్య రాజకీయాల్లో వీరిద్దరు కూడా కుంభకోణాల్లో చిక్కుకోవడం దురదృష్టమనే చెప్పాలి. అది వారి స్వయంకృతాపరాధమే, ఇందులో సందేహం లేదు. ఈ విషయం జయలలితకు ఇప్పటికే అర్థమైంది. కనిమొళి ఆరంభంలోనే ఉన్నారు. పూర్తి రాజకీయ నాయకురాలిగా ఎదగడానికి ఆమెకు సమయం పడుతుంది.

- రాధా రాధాకృష్ణన్

ఈ వార్తాకథనంలోని అభిప్రాయాలతో దట్స్ తెలుగు డాట్ కామ్‌కు సంబంధం లేదు.

English summary
For most part of her 43 years of life, she was perceived to be the heir to her father’s literary legacy while her two step brothers were fighting for the dad’s political legacy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X