వైయస్ జగన్‌ను ఎత్తిపొడిచిన చిరంజీవి, అధికార దాహమని ఆరోపణ

Chiranjeevi
కడప: కడప లోకసభ స్థానంలో ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి వైయస్ జగన్‌పై కయ్యానికి కాలు దువ్వారు. కాంగ్రెసు అభ్యర్థి డిఎల్ రవీంద్రా రెడ్డి తరఫున ఆయన కడప నియోజకవర్గంలో శుక్రవారం తన ప్రచారాన్ని ప్రారంభించారు. చింతకొమ్మ దిన్నే మండలం నుంచి ఆయన రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ అధికార దాహం వల్లనే ఉప ఎన్నికలు వచ్చాయని విమర్శించారు. జగన్ అహంకారానికి, సోనియా ఆత్మగౌరవానికి ఈ ఎన్నికలు పోటీ పెడుతున్నాయని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత అమ్మను సరిగా చూసుకోవాలని చెప్పినందుకు వైయస్ జగన్ సోనియాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారని ఆయన అన్నారు. సోనియా తనను అవమానించారని జగన్ అనడం అబద్ధమని ఆయన అన్నారు. పేరు పెట్టకుండా వైయస్ జగన్‌ను చిరంజీవి ఎత్తిపొడిచారు.

వైయస్ రాజశేఖర రెడ్డి మరణించగానే తనను ముఖ్యమంత్రి చేయాలని జగన్ పట్టుబట్టారని, వారసత్వంగా పదవులు ఇవ్వడానికి ఇది రాజరికం కాదని ఆయన అన్నారు. ప్రజలు అంగీకరిస్తేనే ఎవరైనా ముఖ్యమంత్రి అవుతారని, దాన్ని గుర్తించకుండా ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా జగన్ వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి శవం అక్కడ ఉండగానే జగన్ ముఖ్యమంత్రిని చేయడానికి మద్దతు ఇవ్వాలని అడిగారని, ఇది మన సంప్రదాయం కాదని తాను చెప్పానని, అంతగా జగన్‌లో అధికార దాహం పేరుకుపోయిందని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యాన్ని అవమానించే విధంగా వ్యవహరించారని ఆయన అన్నారు.

వైయస్ రాజశేఖర రెడ్డి పథకాలకు తూట్లు పొడుస్తున్నారనే విమర్శలో నిజం లేదని, వైయస్ పథకాలన్నీ కొనసాగుతాయని ఆయన చెప్పారు. తాను మానసికంగా కాంగ్రెసు మనిషిని అని చెప్పుకున్నారు. కాంగ్రెసు తరఫున రాజకీయంగా సేవలు చేసేందుకు అవకాశం ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు. రాయలసీమలో ఈ అభిమానం తన జన్మకు చాలునని ఆయన అన్నారు. లౌకిక పార్టీ అయిన కాంగ్రెసు పార్టీని గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. కాంగ్రెసు పార్టీ ద్వారానే అభివృద్ధి జరుగుతుందని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+