హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విలీన సభకు పవన్ కళ్యాణ్ డుమ్మా, అన్నయ్య వెంటే నాగబాబు?

By Pratap
|
Google Oneindia TeluguNews

Pawan Kalyan-Chiranjeevi
హైదరాబాద్: కాంగ్రెసులో ప్రజారాజ్యం పార్టీ విలీన సభకు చిరంజీవి సోదరుడు, ప్రముఖ సినీ హీరో పవన్ కళ్యాణ్ హాజరయ్యే అవకాశాలు లేవు. ఆయన రాజకీయాలకు దూరంగా ఉండాలనే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి మరో సోదరుడు నాగబాబు మాటలను బట్టి ఆ విషయం అర్థమవుతోంది. విలీన సభకు పవన్ కళ్యాణ్ రాకపోవచ్చునని, సినిమాలతో పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నాడని ఆయన చెప్పారు. ఓ తెలుగు టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలు మాట్లాడారు. తాను అన్నయ్య వెంటే ఉంటానని ఆయన చెప్పారు. చిరంజీవి కడప నియోజకవర్గంలో కాంగ్రెసు తరఫున ప్రచారం చేస్తుండగా నాగబాబు దాన్ని పరిశీలించడానికి కడప నియోజకవర్గానికి వచ్చారు. తమ అన్నదమ్ముల్లో విభేదాలు లేవని ఆయన చెప్పారు.

పవన్ కళ్యాణ్ చేతిలో ఆరు సినిమాలు ఉన్నాయని, అవి పూర్తయిన తర్వాత తాను ఏం చేయాలో ఆలోచిస్తాడని, ఆ సినిమాలు పూర్తయిన తర్వాత రాజకీయాల్లోకి వస్తాడా రాడా అనేది తెలుస్తుందని ఆయన చెప్పారు. తన వృత్తి తనకు ఉందని, తన వృత్తిని చేసుకుంటూ తాను అన్నయ్య వెంట నడుస్తానని ఆయన చెప్పారు. కాంగ్రెసులో ప్రజారాజ్యం పార్టీ విలీనాన్ని కుటుంబ సభ్యులు ఎవరూ వ్యతిరేకించలేదని ఆయన స్పష్టం చేశారు. విలీనానికి కుటుంబ సభ్యుల నుంచి, ప్రజారాజ్యం పార్టీ నాయకుల నుంచి, ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన ఉందని, ఎవరూ విలీనాన్ని వ్యతిరేకించడం లేదని ఆయన చెప్పారు.

ప్రజల్లోకి వచ్చినప్పుడు చిరంజీవికి ఎప్పుడూ విశేష స్పందన లభిస్తుందని ఆయన చెప్పారు. చిరంజీవి ఇమేజ్‌కు కడప ఎన్నికల జయాపజయాలు గీటురాయి కావని ఆయన అన్నారు. సాధారణ ఎన్నికలకు ముందు తాను, పవన్ కళ్యాణ్ ఎవరూ తిరగనంతగా తిరిగామని, ఎన్నికలు ముగిసిన తర్వాత తానూ పవన్ కళ్యాణ్ ఎవరి పనుల్లో వాళ్లం మునిగిపోయామని, అప్పటికే పవన్ కళ్యాణ్ ఓ సినిమా ఆగిపోయిందని ఆయన చెప్పారు. దాని వల్ల తాము ప్రజారాజ్యం పార్టీ రోజువారీ కార్యకలాపాల్లో పాలు పంచుకోలేకపోయామని ఆయన చెప్పారు.

English summary
Prajarajyam party president Chiranjeevi's brother Nagababu said that Pawn Kalyan is busy in his films. So, Pawan kalyan may not attend merger meeting of Prajarajyam party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X