దేశంలో పెచ్చుమీరిన కుంభకోణాలపై విప్రో చైర్మన్ ఆందోళన

అమెరికా మీడియాతో పోలిస్తే భారతీయ మీడియా ఇటువంటి అంశాలకే ప్రాధాన్యత ఇస్తుందని ఆయన అన్నారు. నిర్ధిష్టమైన అంశానికి సంబంధించి సమ గ్రమైన సమాచారం ఇవ్వాని ఆయన సూచించారు. భారతీయ మీడియా సంఘటలను కేవలం హెడ్‌లైన్స్‌లో ఈవాళ రేపు ఇచ్చి ఊర్కుంటుందని, అదే అమెరికన్ న్యూస్ పేపర్లు సంఘటనకు సంబంధించి ముగింపును ఇవ్వడంతో పాటు సమాజంలోని అవినీతిని శిక్షించేట్లు హామీని కూడా ఇవ్వగలదని ఆయన అన్నారు. చెనైలోని గ్రేట్ లేక్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్నాతకోత్సవంలో ఆయన ఉపన్యసించారు.
సమాజంలోని ఎవరిని ఏ విధంగా వినియోగించుకోవాలి అనే విషయం ఈ దేశానికి తెలుసున ని, కానీ మొత్తం విధానమే పూర్తిగా మారిపోయిందని, విద్యా ర్థులు దీన్ని సెన్సిటివ్‌గా తీసుకుంటారని ప్రేమ్‌జీ అన్నారు. ఈ సందర్భం గా ఆయన గ్రాడ్యుయేట్ పూర్తయిన విద్యార్థుల కు డిప్లామాలను అందజేశారు. ప్రస్తుతం భారతదేశాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని, ఈ సమస్యలను పరిష్కరించడానికి ఎవరో వస్తారను కోద్దని, ప్రస్తుత యువత రం ఈ విషయాలపై బలంగా నిలబడాలని సూచించారు. ఈ ప్రక్షాళన చేపట్టనట్లయితే వచ్చే తరం కూడా ఈ సమస్యల మధ్యనే జీవించాల్సి ఉంటుందని, అందుకే మనం నీతి నిజాయితీ వంటి సూత్రాలను పాటించడంతో పాటు వాటి కోసం బలంగా నిలబడాల్సిన అవసరం ఉందన్నారు.












Click it and Unblock the Notifications