ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ వైయస్సార్ వారసుడు కాడు: నారాయణ

By Pratap
|
Google Oneindia TeluguNews

K Narayana
ఒంగోలు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత వైయస్ జగన్ దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి రాజకీయ వారసుడు కాడని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ అన్నారు. రాష్ట్రంలో మైనింగ్ మాఫియా ఇంకా కొనసాగుతోందని, మైనింగ్ మాఫియాను ప్రభుత్వం అరికట్టాలని ప్రకాశం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. కడప ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులదే విజయమని ఆయన దీమా వ్యక్తం చేశారు. 19 మంది రాష్ట్ర మంత్రులు కడపలో మకాం వేసి రాష్ట్ర ప్రజలను మరిచిపోయారని ఆయన అన్నారు.

ఎన్నికలకు ముందు ప్రజలకు చేసిన వాగ్దానాలను మంత్రులు మరిచిపోయారని, అందువల్ల మళ్లీ ఎన్నికలకు వెళ్లి ప్రజల విశ్వాసం పొందాలని ఆయన అన్నారు. అధికారంలో కొనసాగే హక్కు మంత్రులకు లేదని ఆయన అన్నారు. సంక్షేమ పథకాలను కొనసాగించకపోతే ప్రభుత్వం తిరిగి ఎన్నికలకు వెళ్లాలని ఆయన అన్నారు. సచివాలయానికి పక్షవాతం వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు.

English summary
CPI secretary K Narayana rejected to accept YSR Congress party president YS Jagan as political heir of YSR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X