హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అక్బరుద్దీన్ కేసు సిసిఎస్‌కు, నిందితులను పట్టుకుంటాం: సబితారెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sabitha Indra Reddy
హైదరాబాద్: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌పై కాల్పులు జరిపిన అందరు నిందితులను త్వరలో పట్టుకుంటామని హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. అక్బరుద్దీన్ కాల్పుల కేసును సిసిఎస్ పోలీసులకు అప్పగించామని చెప్పారు. అక్బరుద్దీన్ శరీరం నుండి ఒక్క బుల్లెట్ మినహా అన్ని తీసి వేశారని చెప్పారు. ఆ ఒక్క బుల్లెట్ కూడా డాక్టర్లు ఆదివారం తొలగించడానికి ఆపరేషన్ చేయనున్నారని చెప్పారు.

అక్బరుద్దీన్‌పై నిందితులు ఎన్ని రౌండ్లు కాల్పులు జరిపారన్న విషయం విచారణలో తేలుతుందని అన్నారు. అక్బరుద్దీన్ ఆరోగ్యానికి ఎలాంటి సాయం కావాలన్నా ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధంగా ఉందని ప్రకటించారు. నిందితుల కోసం ప్రత్యేక టీంను పంపించామని చెప్పారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. అక్బరుద్దీన్ హెల్త్‌పై డాక్టర్లతో సమీక్షలు నిర్వహించినట్లు చెప్పారు.

English summary
Homa Minister Sabitha Indra Reddy said today that Akbaruddin case was transfered to CCS Police. She said government is ready to any help for his health.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X