కడప: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి కడుపులో చెడ పుట్టాడని మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి ఆదివారం తన ప్రచారంలో జగన్‌పై ధ్వజమెత్తారు. జగన్ అక్రమంగా వేల కోట్ల రూపాయలు దండుకున్నారని అన్నారు. జగన్ డబ్బులకు లొంగేది కేవలం డజను మంది ఎమ్మెల్యేలే అన్నారు. మరెంతో మంది అయన వెంట వెళ్లడానికి సిద్ధంగా లేరని అన్నారు. జగన్ పక్కన తిరగడానికి కూడా ఎవరూ సిద్ధంగా లేరని అన్నారు. జగన్‌కు ఎమ్మెల్యేలు తాబేదార్లు కాదని అన్నారు. జగన్ కోరుకుంటేనే ఎన్నికలు రావని చురక వేశారు.
భూమి, ఆకాశం ఏకమైనా కేంద్రం, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఎవరూ పడగొట్టలేరని మరో మంత్రి రఘువీరారెడ్డి అన్నారు. నలుగురు అల్లరి మూకలను వెనకేసుకొని చేతకాని పనులు జగన్ చేస్తున్నారని ఆరోపించారు. జగన్ తన ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. కాగా డిఎల్ ప్రచారం సందర్భంగా కాంగ్రెసు కార్యకర్తలు మీడియాపై దాడి చేశారు. అయితే డిఎల్ రవీంద్రారెడ్డి వారిని సముదాయించి మీడియాకు క్షమాపణలు చెప్పారు.
Minister DL Ravindra Reddy accused that Ex MP YS Jaganmohan Reddy was born to late YSR unfortunatly. He said no one MLAs are surrender to YS Jagan cash.
Story first published: Sunday, May 1, 2011, 12:54 [IST]