హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు గూండాలను తీసుకు వెళ్లి కడప జిల్లాలోని కొమ్మునూతల గ్రామస్తులను బెదిరించారని ఎన్టీఆర్ టిడిపి అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి సోమవారం అరోపించారు. చంద్రబాబు ప్రచారం చేసుకోకుండా అక్కడి గ్రామస్తులను బెదిరించడం శోచనీయమన్నారు. వారిని బెదిరించడమే కాకుండా వారిపై పోలీసు స్టేషన్‌లో కేసులు పెట్టడం శోచనీయం అన్నారు. కడప, పులివెందుల ఉప ఎన్నికల తీరుపై మీడియా పాత్ర కూడా సరిగా లేదని అన్నారు. మీడియా సక్రమంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజలకు నిజాలు చెప్పవలసిన మీడియా పాత్ర సంతృప్తికరంగా లేదన్నారు.
కాగా వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ, కాంగ్రెసులపై ఎన్నికల సంఘంలో ఫిర్యాదు చేశారు. అధికారం, బెదిరింపులకు ఆ రెండు పార్టీలు పాల్పడుతున్నాయని ఫిర్యాదు చేశారు. కడపలో ఎన్నికలు సక్రమంగా జరిగేలా చూడాలని కోరారు.
NTR TDP president Laxmi Parvathi blamed TDP president Chandrababu Naidu for Kommunuthala issue. She said Chandrababu threatened village people and registered case against them.
Story first published: Monday, May 2, 2011, 16:59 [IST]