అర్చకులు, జీయంగార్ల మధ్య గొడవ: ఆగిపోయిన స్వామివారి ఊరేగింపు
Districts
oi-Srinivas G
By Srinivas
చిత్తూరు: తిరుపతిలోని గోవిందరాజుల స్వామి వారి ఆలయంలో అర్చకులు, జీయంగార్ల మధ్య మంగళవారం గొడవ జరిగింది. ఉదయం గోవిందరాజుల స్వామి ఆలయ సన్నిధిలోని రామానుజాచార్యుల ఊరేగింపును జీయంగార్లు ప్రారంభించారు. అయితే రామానుజాచార్యుల ఊరేగింపు కోసం అర్చకులు నగలు ఇవ్వలేదు. నగలు ఇవ్వాల్సిందిగా జీయంగార్లు అడిగారు. అర్చకులు ఇవ్వక పోవడంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది.
రామానుజాచార్యుల ఊరేగింపు కోసం నగలు ఇవ్వాలంటూ జీయంగార్లు ఆందోళన చేశారు. నగలు వచ్చిన తర్వాతనే ఊరేగింపు చేస్తామని చెప్పారు. దీంతో స్వామి వారి ఊరేగింపు ఆగిపోయింది.