టిడిపికి రాజీనామా చేస్తే నాగంతో కలిసి పని చేస్తాం: ఈటెల రాజేందర్

పాత రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీలనే కొనసాగించాలని తమ పార్టీ సమావేశంలో నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. పాత పోలిట్‌బ్యూరోను కొనసాగిస్తూ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మాజీ పార్లమెంటు సభ్యుడు జితేందర్ రెడ్డిని పొలిట్ బ్యూరోలోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. 33 మందితో తెరాస రాష్ట్ర కమిటీ ఏర్పాటైనట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర కమిటీలో పాల్గొన్న తర్వాత జిల్లా కమిటీల సమావేశాల్లో తమ పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు పాల్గొంటారని ఆయన చెప్పారు.
తెలుగుదేశం పార్టీలోనే నాగం జనార్దన్ రెడ్డికి స్థానం లేకుండా చేస్తున్నారని, తన పార్టీలోనే నాగం ఆగమాగం అవుతున్నారని తెరాస నాయకుడు నాయని నర్సింహా రెడ్డి వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వస్తే నాగం జనార్దన్ రెడ్డిని నమ్ముతామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications