కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బిజెపితో కలయికపై మళ్లీ వైయస్ జగన్ వివాదాస్పద వ్యాఖ్యలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
కడప: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలను చేశారు. మంగళవారం ఉదయం చాపాడు మండలం ఖాదర్‌పల్లె గ్రామంలో ప్రచారాన్ని నిర్వహిస్తున్న జగన్మోహన్ రెడ్డి మరోసారి బిజెపి మాట ఎత్తారు. భారతీయ జనతా పార్టీ ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్ ఇస్తే ఆ పార్టీతో కలిస్తే తప్పేంటని ఓటర్లను ఉద్దేశించి చెప్పినట్లుగా తెలుస్తోంది. ముస్లింల రిజర్వేషన్‌కు బిజెపి సరే అంటే ఆ పార్టీతో కలుస్తానని పది రోజుల క్రితం కూడా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అప్పుడే ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని లేపాయి. అయితే ఆయన తాను అలా అనలేదని కప్పి పుచ్చుకున్నారు. కానీ మంగళవారం మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేశారు.

ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ కల్పించింది వైయస్ కానీ కాంగ్రెస్ కాదన్నారు. కాంగ్రెసు కల్పించి ఉంటే దేశవ్యాప్తంగా అమలయ్యేవన్నారు. కాగా బిజెపితో కలిస్తే ఏంటని జగన్ వ్యాఖ్యలు చేయడం అవగాహనా రాహిత్యంతో కూడినట్లుగా ఉందని పలువురు భావిస్తున్నారు. పోలింగ్‌కు మరో వారం రోజులు కూడా లేని సమయంలో జగన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆయనకే నష్టమని అంటున్నారు. అయితే బిజెపి నాయకులతో ఆయన సంబంధాలు బహిరంగ రహస్యమే.

English summary
Ex MP YS Jaganmohan Reddy repeated again reservation and BJP issue in his campaign. He said he will alliance with BJP if they ready to give 10 percent reservation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X