హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కడప ఉప ఎన్నిలు వైయస్‌కు, జగన్‌కు మధ్య పోరు: మల్లు భట్టి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Mallu Bhatti Vikramarka
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తన స్వార్థ ప్రయోజనాల కోసం కడప, పులివెందులలో ఉప ఎన్నికలు తెచ్చారని కాంగ్రెసు పార్టీకి చెందిన నాయకులు వేరు వేరుగా బుధవారం ధ్వజమెత్తారు. వైయస్ అభిమానులు కాంగ్రెసు పార్టీకే ఓటు వేయాలని కాంగ్రెస్ విప్ మల్లు భట్టి విక్రమార్క వోటర్లకు పిలుపునిచ్చారు. కాంగ్రెసు ప్రజల పార్టీ అని చెప్పారు. కడప, పులివెందుల ఉప ఎన్నికలలో కాంగ్రెసును గెలిపించడానికి వోటర్లు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెసు పార్టీ ద్వారానే అభివృద్ధి సాధ్యం అని ఓటర్లు భావిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు చూసి ప్రజలే కాంగ్రెసుకు ఓటు వేయాలని అనుకుంటున్నారని అన్నారు. ఈ ఎన్నికలు వైయస్‌కు, జగన్‌కు మధ్య పోరుగా ఆయన అభివర్ణించారు.

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి మతతత్వాలకు దూరంగా ఉన్నారని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. వైయస్ రాముడైతే వివేకా లక్ష్మణుడు అని పొగిడారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత అధిష్టానం తెలంగాణ ప్రకటన ఖచ్చితంగా చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా ప్రభుత్వాన్ని కూల్చాలనే జగన్ అనుకుంటున్నారని మరో నేత కమలాకరరావు అన్నారు. అహంకారంతోనే జగన్ కాంగ్రెసు పార్టీని వీడాడని అన్నారు. సోనియాను జగన్ విమర్శించడం సరికాదన్నారు.

English summary
Mallu Bhatti Vikramarka said today that Kadapa voters are with Congress. He accused that bypoll came for Ex MP YS Jagan's selfish.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X