వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
లాడెన్‌పై ఏకపక్ష దాడికి పాక్‌కు క్షమాపణ చెప్పే ప్రసక్తి లేదు: అమెరికా

ఈ దేశానికి లాడెన్ ఒకటో నెంబర్ శత్రువు అని, చాలా చాలా మంది పౌరులను హతమార్చాడని, క్షమాపణలేవీ ఉండవని కార్నే అన్నారు. అమెరికా కమెండో ఆపరేషన్ ఏకపక్షమూ, అనధికారయుతమని పాకిస్తాన్ సోమవారం వ్యాఖ్యానించింది. ఇస్లామ్‌పై తాము యుద్ధం చేయడం లేదని శ్వేతసౌధం స్పష్టం చేసింది. లాడెన్ ముస్లిం నాయకుడు కాడని, లాడెన్ సామూహిక హత్యకాండకు పాల్పడిన వ్యక్తి అని బుష్‌తో పాటు ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా చెప్పారని అన్నారు. ముస్లింలను కూడా లాడెన్ హత్య చేశాడని అన్నారు.
అమెరికాను, అమెరికన్లను కాపాడుకోవడానికి తాము ఆల్ ఖైదాపై తమ పోరాటానికి పాకిస్తాన్ ముస్లింలు, ఇతర దేశాల్లోని ముస్లింలు, ముస్లిం అమెరికన్లు తమకు సహకరించారని ఆయన అన్నారు.