ఉప ఎన్నికల దృష్ట్యా కడప జిల్లాలో భారీ బందోబస్తు

YS Jagan
కడప: ఉప ఎన్నికల దృష్ట్యా జిల్లాలో భారీగా పోలీసులు మోహరించినట్లు రాయలసీమ ఐజీ సంతోష్ మెహ్రా తెలిపారు. ఆయన గురువారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ సమస్యాత్మక ప్రాంతాల్లో పారా మిలటరీ బలగాలను దింపినట్లు తెలిపారు. అలాగే ఉప ఎన్నికల్లో ఫిర్యాదుల కోసం (94935 48224, 94935 48225) హెల్ప్ లైన్ నెంబర్లకు ఫోన్ చేయవలసిందిగా ఐజీ పేర్కొన్నారు.

బందోబస్తు నిమిత్తం పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకల పోలీసు బలగాలు కూడా వస్తున్నట్టు రాష్ట్ర పోలీసు డైరక్టర్‌ జనరల్‌ అరవిందరావు తెలిపారు. హైదరాబాద్‌లోని కేంద్ర బలగాలన్నీ అక్కడికి వెళ్తాయన్నారు. మొత్తం 10వేల మంది పోలీసు సిబ్బంది ఎన్నికల బందోబస్తులో పాల్గొంటారని డీజీపీ వెల్లడించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌తో కలసి డీజీపి బుధవారం కడపలోని ఎన్నికల, పోలీసు అధికారులతో వీడియో సమావేశాన్ని నిర్వహించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+