కడప: కురుక్షేత్రంలో అభిమన్యుడిపై కౌరవులు దాడి చేసినట్లు తనపై ముప్పేట దాడి చేస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కడప లోకసభ అభ్యర్థి వైయస్ జగన్ వ్యాఖ్యానించారు. ఆయన గురువారం కడప లోకసభ స్థానంలో ప్రచారం నిర్వహించారు. కాంగ్రెసుకు ఉన్నట్లు తనకు అధికారం లేదని, తన వద్ద డబ్బుల మూటలు లేవని ఆయన అన్నారు. కాంగ్రెసు మంత్రుల మాదిరిగా తాను హింసను ప్రోత్సహించలేనని ఆయన అన్నారు.
పత్రికలు, కాంగ్రెసు, తెలుదేశం పార్టీలు ఓటు 500 రూపాయల చొప్పున పంచుతున్నాయని ఆయన ఆరోపించారు. కాంగ్రెసు పార్టీ కుట్రను ప్రజలు అర్థం చేసుకుంటున్నారని ఆయన అన్నారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి దిమ్మ తిరిగే విధంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. తాను బిజెపితో పొత్తు పెట్టుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు.
YSR Congress Party Kadapa candidate YS Jagan has made comment that opponents are attacking from all sides on him like attack on Abhimanyu in Kurukshetra.
Story first published: Thursday, May 5, 2011, 15:58 [IST]