ఆటో - లారీ ఢీ: ఏడుగురు మృతి, పదిమంది మందికి తీవ్ర గాయాలు
Districts
oi-Srinivas G
By Srinivas
|
మహబూబ్‌నగర్: జిల్లాలో గురువారం ఘోర రహదారి ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందగా, మరో పది మంది తీవ్రంగా గాయపడ్డట్టు తెలుస్తోంది. కల్వకుర్తి నుండి వెళుతున్న ఓ ఆటోను ఎదురుగా వస్తున్న ఓ లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోలో ఉన్న వారు ఏడుగురు మరణించారు. ఇది మహబూబ్‌నగర్ జిల్లాలోని వెల్దండ మండలం కొట్రగడ్డ వద్ద చోటు చేసుకుంది.
ప్రమాదంలో గాయపడ్డ పదిమందిని వెంటనే కల్వకుర్తిలోని జనరల్ హాస్పిటల్‌కు తరలించారు. వారి పరిస్థితి బాగానే ఉన్నట్టు డాక్టర్లు చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే వీరి మరణంతో వారి వారి కుటుంబాల్లో విషాధఛాయలు అలుముకున్నాయి. ఆటోలోని వారంతా కల్వకుర్తికి చెందిన వారుగా తెలుస్తోంది.