వైయస్ జగన్ ఎమ్మెల్యేలపై సిఎం కిరణ్ కుమార్ నుండి ఆజాద్ ఆరా

ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తి కావడంతో తెలంగాణ అంశంపై కూడా ఆజాద్ దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. మే తర్వాత తెలంగాణపై స్పష్టమైన వైఖరి తేలకుంటే తాము రాజీనామాలకు సిద్ధపడతామని స్వయంగా కాంగ్రెసు ప్రజాప్రతినిధులే హెచ్చరించిన నేపథ్యంలో ఆయన సిఎం కిరణ్‌తో తెలంగాణ అంశంపై చర్చించినట్లుగా తెలుస్తోంది. గవర్నర్ కోటాలో ఎంపిక చేయాల్సిన ఎమ్మెల్సీ కోటాపై కూడా చర్చ జరిగింది. సిఎం కిరణ్ కుమార్ రెడ్డి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. శుక్రవారం సాయంత్రం గానీ, శనివారం ఉదయం గానీ ముఖ్యమంత్రికి సోనియా అపాయింట్‌మెంట్ దొరికే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications