నాగబాబు వచ్చినా చిరంజీవి లేవమంటారు: జగన్ వర్గం నేత రోజా

కడప, పులివెందులలో జగన్‌ను ఓడించేందుకు కాంగ్రెసు, టిడిపిలు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడుతున్నాయన్నారు. జగన్ రాజకీయంగా ఎదగకూడదని సోనియాగాంధీ కూడా కోరుకుంటున్నారన్నారు. ఎంత ఖర్చు పెట్టైన సరే జగన్ మెజార్టీ తగ్గించాలని వారు చూస్తున్నారన్నారు. చిరు మీసం తిప్పి, తొడ కొట్టడం వల్ల జగన్ మెజార్టీ మరింత పెరుగుతుందన్నారు. సామాజిక మార్పు పేరుతో కాంగ్రెసుపై విమర్శలు చేసి 18 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న చిరంజీవి ఇప్పుడు అదే కాంగ్రెసులో కలవడం నీతిమాలిన చర్య అన్నారు. రాష్ట్రానికి మంచి చేసిన వైయస్ కుటుంబం వైపే కడప ప్రజలు ఉన్నారన్నారు. ప్రజలు జగన్ వైపు ఉన్నారని, కాబట్టి నాయకులు ఎటు వెళ్లినా సమస్య లేదన్నారు.












Click it and Unblock the Notifications