కడపలో మళ్లీ జడలు విప్పిన ఫ్యాక్షన్: ఇద్దరు కాంగ్రెసు కార్యకర్తల హత్య

లక్ష్మీనారాయణకు దగ్గర బంధువుగా భావించబడుతున్న సుబ్బారాయుడును కత్తులతో నరికారు. అయితే తీవ్ర గాయాలతో ఉన్న సుబ్బారాయుడును ఆసుపత్రికి తరలించేలోపు మరణించాడు. వీరిని ప్రత్యర్థులు అయిన నడికొండ వర్గం హత్య చేసి ఉంటుందని పలువురు భావిస్తున్నారు. నడికొండ వర్గానికి, చనిపోయిన వారికి గత కొన్నాళ్లుగా ఆధిపత్యపోరు, భూవివాదం నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. 1999లో కూడా ఓ హత్య కేసులో మృతులు నిందితులని సమాచారం. 2003లో వీరు ఆ కేసు నుండి బయట పడ్డారు. అయితే ఒక రోజు పోతే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో హత్యలు జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.












Click it and Unblock the Notifications