ఉప పోరు తెచ్చిన సమస్య: వైయస్ జగన్ వర్గంలో అసంతృప్తులు!

YS Jagan
కడప: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గంలో ఉప ఎన్నికలు అసంతృప్త వర్గాలను తెచ్చినట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికే ఓ ముఖ్య ఎమ్మెల్యే జగన్‌కు డబ్బుల విషయంలో తగాదా వరకు వెళ్లినట్లుగా వార్తలు వచ్చాయి. కడప ఉప ఎన్నికల్లో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు ఇతర జిల్లాల నేతల ప్రచారంపైనే ఆధారపడ్డాయంటూ పదే పదే విమర్శలు గుప్పిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెసు పార్టీలోనూ ప్రస్తుతం అదే పరిస్థితి కనిపిస్తోంది. జగన్ కడప, పులివెందులలో ఇతర జిల్లాల నేతలకే కీలక బాధ్యతలు అప్పగించడంతో స్థానిక నేతలు ప్రేక్షక పాత్ర వహించ వలసి రావడం వారిలో అసంతృప్తిని కలిగిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రచారానికి సంబంధించిన ప్రతి విషయంలోనూ ఇతర ప్రాంతాల నేతల దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడాల్సి రావడంతో వైఎస్ఆర్ కాంగ్రెసు‌లోని స్థానిక నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కడప లోక్‌సభ సమన్వయకర్తలుగా మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిలను నియమించారు.

పార్టీ ఎన్నికల కమిటీలో ఎంపీలు సబ్బం హరి, మేకపాటి రాజమోహనరెడ్డి ఉన్నారు. కడప లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మంట్‌ల విషయానికి వస్తే కడప కార్పొరేషన్ స్థాయిలో డివిజన్ పర్యవేక్షకులుగా ఎమ్మెల్యే అమరనాథ్‌రెడ్డి, జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్యేలు ప్రసాదరాజు, బాబూరావు, ఆళ్ల నాని తదితరులను నియమించారు. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి పూర్తిగా తమ సొంత మనుషులు వైఎస్ భాస్కరరెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డిలకు జగన్ కీలక బాధ్యతలు అప్పగించారు.
మైదుకూరు శాసనసభా నియోజకవర్గం బాధ్యతలను శోభా నాగిరెడ్డికి అప్పగించారు. ప్రొద్దుటూరుమాజీ మంత్రి కొండా సురేఖకు అప్పగించారు. బద్వేల్లో కీలక బాధ్యతల్లో ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, రైల్వే కోడూరు ఎమ్మెల్యేలు శ్రీనివాసులు, ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి, ఎమ్మెల్యేలు శివ ప్రసాద్‌రెడ్డి, రామకృష్ణారెడ్డిలను నియమించారు.

అయితే వీరంతా స్థానికేతరులే. దీంతో స్థానికంగా ఉన్న నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఎన్నికల కోడ్ ప్రకారం శుక్రవారం సాయంత్రం ఐదు గంటల తర్వాత వీరంతా వైఎస్ఆర్ జిల్లా నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుంది. వీరు వెళ్లిపోయాక స్థానిక నేతలు ఏంచేయాలో వారికి సరైన దిశానిర్దేశం ఎవరు చేయాలో తెలియని పరిస్థితి మా పార్టీలో కన్పిస్తోంది అని జగన్ పార్టీ నేత ఒకరు అన్నారు. సొంత జిల్లాలో అందులోనూ సొంత నియోజకవర్గాల్లో జరుగుతున్న ఉప ఎన్నికలకు ఇతర ప్రాంతాల నుంచి నేతలను వలసలు తెచ్చుకోవడం ఏమిటని ఆ నేత ఆగ్రహం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+