సమాజంలో పెచ్చురిల్లుతున్న తీవ్రవాదానికి వ్యతిరేఖంగా పోరాడేందుకు తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉన్నామని బంగ్లాదేశ్ స్పష్టం చేసింది. ఏ దేశానికైనా వ్యతిరేఖంగా పనిచేసే సంఘవిద్రోహక శక్తులను తమ దేశంలోని అనుమతించబోమని, ఆలాంటి వారిని ఉపేక్షించబోమని బంగ్లాదేశ్ పేర్కొంది. విశ్వకవి రవీంధ్రనాథ్ ఠాగూర్ 150వ జన్మదినాన్ని పురస్కరించుకొని బంగ్లాదేశ్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆ దేశ ప్రణాళికా మంత్రి ఏ కె ఖండ్కర్ తమ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. తమ దేశ స్వాతంత్ర్య పోరాటంలో భారదేశం సహకారాన్ని, మద్దతును మరిచపోరాదని అన్నారు. రిటైర్డ్ ఎయిర్ వైస్ మార్షల్ అయిన్ ఖండ్కర్ 1971లో జరిగిన బంగ్లాదేశ్ స్వాతంత్రోద్యమంలో కూడా పాల్గొన్నారు. భారత ప్రభుత్వం మరియు ప్రజల నుంచి మద్దతును బంగ్లాదేశ్ ప్రజలు ఎప్పటికీ మరచిపోరని ఖండ్కర్ అన్నారు.
Bangladesh Expressed its commitment to fight the scourge of terrorism and promised India that, their territory will not be allowed to be used by elements working against the interests of any country.