హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నాగం జనార్దన్ రెడ్డిపై చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటారా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Nagam Janardhan Reddy
హైదరాబాద్: తెలంగాణపై దూకుడుగా వ్యవహరిస్తున్న తమ పార్టీ తెలంగాణ ఫోరం కన్వీనర్ నాగం జనార్దన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై చర్యలు తీసుకునే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. కడప లోకసభకు, పులివెందుల శాసనసభకు జరుగుతున్న ఉప ఎన్నికలు ముగిసిన తర్వాత చంద్రబాబు నాగం జనార్దన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. నాగం జనార్దన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబుపై పార్టీ నాయకులు ఒత్తిడి పెంచుతున్నట్లు చెబుతున్నారు. ఈ నెల 9వ తేదీన మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూలులో ఏకపక్షంగా తెలంగాణ బహిరంగ సభను ఏర్పాటు చేయడంపై నాగం మీద చంద్రబాబు గుర్రుగా ఉన్నట్లు చెబుతున్నారు.

తెలంగాణలో తమ పార్టీ నాయకుడు చంద్రబాబు కన్నా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికే ఎక్కువ విశ్వసనీయత ఉంటుందని నాగం జనార్దన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పార్టీ నాయకులు ఆగ్రహంతో ఉన్నట్లు చెబుతున్నారు. పార్టీలో కొంత మంది చిల్లరగాళ్లున్నారని నాగం చేసిన వ్యాఖ్యలు కూడా పార్టీలో కలకలం రేపాయి. పైగా, తెలంగాణపై తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు చెప్పినా వినబోనని, మిగతా విషయాల్లో పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉంటానని నాగం పదే పదే అంటున్నారు. నాగం ఈ విధంగా వ్యవహరిస్తుండడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని పార్టీ నాయకులు చంద్రబాబుతో అంటున్నట్లు సమాచారం. ఈ స్థితిలో నాగంపై చర్యలు తీసుకునే విషయంపై చంద్రబాబు దృష్టి సారించే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

English summary
It is learnt that TDP president N Chandrababu Naidu may take action against MLA from Telangana, Nagam Janardhan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X