నోయిడాలో అధికారుల నిర్బంధం: హింస, పోలీసు కాల్పులు

తమ భూముల్లో సగం మాత్రమే స్వాధీనం చేసుకోవాలని, మిగతా భూమి అభివృద్ధిలో తమను భాగస్వాములను చేయాలని రైతులు డిమాండ్ చేస్తూ మూడు నెలలుగా ఆందోళన సాగిస్తున్నారు. నోయిడా, గ్రేటర్ నోయిడా, యమున ఎక్స్‌ప్రెస్ వే ప్రాజెక్టుల్లో 25 శాతం రిజర్వేషన్లు కావాలని వారు డిమాండ్ చేస్తున్నారు. భూమిలేని రైతులకు 120 చదరపు మీటర్ల స్థలం, ఐదు లక్షల రూపాయలేసి నష్టపరిహారం ఇవ్వాలని కూడా వారు అడుగుతున్నారు.
బస్సు మార్గాలా కోసం సర్వేకు వచ్చిన అధికారులను భట్టా పర్సౌల్ గ్రామానికి చెందిన రైతులు నిర్బంధించారు. జిల్లా అధికార యంత్రాంగంతో చర్చలకు వారు నిరాకరించారు. తమ డిమాండ్లపై ముఖ్యమంత్రి మాయావతి స్పష్టమైన ప్రకటన చేస్తేనే అధికారులను వదిలిపెడతామని చెప్పారు. దుర్దేష్ భరద్వాజ్, నిరంజన్ దాస్ అనే అధికారులను, వారి డ్రైవర్ జితేందర్‌ను శుక్రవారం ఉదయం నిర్బంధించడంతో సమస్య ప్రారంభమైంది.












Click it and Unblock the Notifications