వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒసామా బిన్ లాడెన్‌ను కాల్చి చంపింది గడ్డం ఉన్న రాంబో?

By Pratap
|
Google Oneindia TeluguNews

Osama Bin Laden
వాషింగ్టన్: ఆల్ ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్‌పై కాల్పులు జరిపి, అతన్ని హతమార్చింది ఎవరనేది ఆసక్తికరంగా మారింది. అమెరికా నేవీ సీల్స్ ఆపరేషన్ చేపట్టినప్పటికీ రాంబో లాంటి గడ్డం ఉన్న వ్యక్తి లాడెన్‌పై కాల్పులు జరిపినట్లు భావిస్తున్నారు. అమెరికన్లు బిగ్ గేమ్ ఫైటర్‌గా పిలిచే రాంబో వంటి ఫైటర్ చిత్రాన్ని గీయడానికి ప్రయత్నించారు.

లాడెన్‌పై కాల్పులు జరిపిన నేవీ సీల్స్ సభ్యుడికి 26 నుంచి 33 ఏళ్ల వయస్సు ఉంటుందని వాషింగ్టన్ పోస్టు పత్రిక రాసింది. ముగ్గురు మాజీ సీల్స్ ఇచ్చిన వివరాల ఆధారంగా ఆ పత్రిక ఆ రాంబో లాంటి సీల్ చిత్రాన్ని గీసింది. సీల్స్‌లో మహిళలు ఉండరు కాబట్టి లాడెన్‌పైకి కాల్పులు జరిపింది పురుషుడేనని చెబుతున్నారు. అతను శ్వేతజాతీయుడని, తనకు సవాళ్లు ఎదురు కాని సమయాల్లో కూడా ప్రమాదంలోకి వెళ్లి పని పూర్తి చేస్తాడని అంటున్నారు.

అతను ఓ అథ్లెటిక్ లాగా ఉంటాడని, వేగమూ చురుకుదనమూ అతనికి లభించిన వరాలని అంటున్నారు. అతని శరీరాకృతి గురించి చెప్పడానికి వాషింగ్టన్ పోస్టు ప్రయత్నించింది. కళాశాలల్లో ఫుట్‌బాల్ స్టడ్సే ఎక్కువగా సీల్స్‌గా ముందుకు వస్తారని చెబుతున్నారు.

English summary
The veil will probably never lift on the man who pulled the trigger on Osama bin Laden early last Monday at Abbottabad, but efforts are on to paint a pen portrait of this Rambo-like fighter who Americans will call the ultimate big-game hunter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X