పితృత్వం కేసులో ఎన్‌డి తివారీకి చుక్కెదురు, రక్తనమూనాలపై ఆదేశాలు

రోహిత్ శేఖర్ తివారీకి పుట్టాడా, లేదా అని తేల్చడానికి డిఎన్ఎ పరీక్షలు నిర్వహించాలని కోర్టు నిర్ణయించింది. ఇందుకు గాను రక్తం నమూనాలు ఇవ్వాలని హైకోర్టు తివారీని ఆదేశించింది. అయితే, ఏదో కారణంతో తివారీని దాటేస్తూ వస్తున్నారు. తన రక్తం నమూనాలను పంపుతానని ఆయన చెప్పారు. అది కుదరదని, తివారీ స్వయంగా వచ్చి రక్తం నమూనాలు ఇవ్వాలని హైకోర్టు తేల్చి చెప్పింది. తన పరువును తీయడానికే ఈ విధమైన కేసు వేశారని తివారీ ఆరోపిస్తున్నారు. అయితే, తన తల్లితో వైవాహికేతర సంబంధం వల్ల తాను తివారీకి పుట్టానని, అందువల్ల తనను తివారీ పుత్రుడిగా ప్రకటించాలని రోహిత్ శేఖర్ అంటున్నాడు.












Click it and Unblock the Notifications