చైనా క్లే తవ్వకాలు వ్యతిరేకిస్తూ రాళ్ల దాడి, కత్తులతో ర్యాలీ పారిపోయిన ఎమ్మెల్యే

అది కాస్త ఉద్రిక్తంగా మారింది. రెచ్చిపోయిన గిరిజనులు ఎమ్మెల్యే సోమపై దాడికి యత్నించారు. దీంతో ఎమ్మెల్యే సమావేశం నుండి పారిపోయారు. వారు ఆయన స్కార్పియో వాహనంపై రాళ్ల వర్షం కురిపించారు. అయితే ఎమ్మెల్యే వాహనం కాస్త దెబ్బతిన్నప్పటికీ ఆయనకు ఏమీ కాలేదు. ఎమ్మెల్యేతో పాటు వచ్చి డుంబ్రీగూడ ఎంపిపి దున్నేరావుపై కూడా గిరిజనలు దాడికి యత్నించారు. ఏజెన్సీలో చైనా క్లే తవ్వకాలకు వ్యతిరేకంగా గిరిజనులు సర్రాయిలో సమావేశం ఏర్పాటు చేశారు. తవ్వకాలు జరిపితే బావుండదని హెచ్చరించారు. తవ్వకాలు అడ్డుకుంటామని కత్తులతో ర్యాలీ నిర్వహించారు.












Click it and Unblock the Notifications