పుదుచ్చేరిలోనూ జయకూటమి హవా: రంగస్వామి కాంగ్రెస్ ఘన విజయం
National
oi-Srinivas G
By Srinivas
పుదుచ్చేరి: తమిళనాట విజయకేతనం ఎగురవేసిన అన్నాడిఎంకె తన మిత్రపక్షంతో కలిసి పుదుచ్చేరిలో కూడా ఘన విజయం సాధించింది. రంగస్వామి నేతృత్వంలోని రంగస్వామి కాంగ్రెస్, అన్నాడిఎంకెలు 30 స్థానాలకు గాను 18 స్థానాలు గెలుచుకొని రెండు స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతోంది. అంటే మూడింట రెండొంతుల సీట్లను రంగస్వామి కాంగ్రెసు, అన్నాడిఎంకె కైవసం చేసుకున్నాయి. ఇక డిఎంకె, కాంగ్రెసు కూటమి కేవలం 9 సీట్లు గెలుచుకొని రెండో స్థానంలో నిలిచింది.
ఇతరులు ఒక సీటులో గెలుపొందారు. యానాం నుండి తెలుగువాడైన మల్లాది కృష్ణారావు వరుసగా ఐదోసారి విజయం కాంగ్రెసు పార్టీ నుండి సాధించారు. కామరాజునగర్ నుండి ముఖ్యమంత్రి వైద్యలింగం గెలుపొందారు.