సిఎంకు సలహాలు ఇవ్వడంలో మేం ఫెయిలయ్యాం: మంత్రి బొత్స

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ భావజాలంతో ఉన్న పార్టీలు విజ యం సాధి ంచి.. ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ నాయకత్వాన్ని బలపరచడం హర్షణీయమన్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించలేకపోవడం ఇబ్బందిని కలిగించిందన్నారు. కడప ఫలితాన్ని పరిశీలించిన తర్వాత మంత్రులుగా మా పనితీరును మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉందని గుర్తించానన్నారు. నేను నా పనితీరును మార్చుకునేందుకు సన్నద్ధంగా ఉన్నానని, సిఎం, పిసిసి అధ్యక్షుడు, మంత్రివర్గం, పార్టీ నేతలు కూడా మారాల్సిన అవసరం ఉందన్నారు. అందరూ సమష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో ఎవరెవరో కల్పిస్తున్న అపోహలకు దీటుగా సమాధానం చెప్పలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న చిన్న విషయాలపై శ్రద్ధ చూపకపోవడంతో దాని ప్రభావం ప్రభుత్వంపై పెద్దగా కనిపిస్తోందని బొత్స వివరించారు. సిఎంకు సలహాలివ్వడంలో తాము విఫలం చెందామేమోనని సందేహం వ్యక్తంచేశారు.
సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పార్టీ పెద్దలు అందరితోనూ చర్చించాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో పరిణామాలతో కొంత ఇబ్బందిగానే ఉందని అంగీకరించారు. గతంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 14 మంది రాజీనామా చేసిన తర్వాత స్థానిక ప్రజల ఆకాంక్ష మేరకు ఒక్కొక్కరు భారీ మెజారిటీతో గెలిచిన విషయాన్ని గుర్తు చేశారు. కడప పోరు కూడా ఇలాంటి సాధారణమైనదేనన్నారు. ఈ ఫలితంపై విశ్లేషించుకుని రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీపై ప్రజల్లో విశ్వాసం కల్పించాలంటే సీఎం, పీసీసీ అధ్యక్షుడితో సహా అందరూ కలసి పనిచేయాలని బొత్స ఆకాంక్షించారు.
జగన్ గెలుపు పాల పొంగు లాంటిదని.. అదే విధంగా కాంగ్రెస్‌కు దుర్దినమని శుక్రవారం సీఎం చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైన్నారు. కడప పోరు వ్యూహంలో విఫలయ్యామన్న విషయాన్ని అంగీకరించక తప్పదని చెప్పారు. తెలంగాణ అంశంపై త్వరగా తేల్చేయాలని అభిప్రాయపడ్డారు. ఇస్తామనో ఇవ్వలేమనో ఏదో ఒక నిర్ణయాన్ని ఎంత త్వరగా తేల్చితే అంత లాభమని అన్నారు. సీఎం ఇప్పుడు పనిచేస్తున్నదానికంటే మరింత మెరుగ్గా పనిచేయాల్సిన అవసరం ఉందని మాత్రమే తాను చెప్పానన్నారు.
ప్రభుత్వాన్ని కూల్చాలని జగన్ అనుకుంటుంటే టీడీపీ అడ్డు వస్తోందని అంటున్నారని, సత్తా ఉంటే షోకాజ్ నోటీసులొచ్చిన నలుగురు ఎమ్మెల్యేలతోనూ తన వెంట తిరిగే మరికొందరు ఎమ్మెల్యేలతోనూ రాజీనామా చేయించవచ్చు కదా అని నిలదీశారు. అవిశ్వాసం పెడితే కాంగ్రెస్‌కు టీడీపీ అనుబంధంగా పనిచేస్తోందో లేదో తెలుస్తుందని బొత్స సత్యనారాయణ అన్నారు.












Click it and Unblock the Notifications