రామ్‌దేవ్ బాబా మందు, జట్టు కోసం వాడితే అన్నవాహిక బ్లాక్

జష్మీ శంకర్ నరుపులా అనే 39 ఏళ్ల మహిళ భయాందర్‌లోని శాంతినగర్‌లో గల యోగ పతంజలి దుకాణం నుంచి మందు కొని వాడింది. దాంతో ఆమె అన్నవాహిక మూసుకుపోయి, మాట పడిపోయింది. దీంతో ఆ పౌడర్‌ను సూచించిన బాబా రామ్‌దేవ్ పతంజలి యోగపీఠ్‌పై భోయివాడ పోలీసు స్టేషన్‌లో మెడికో లీగల్ కేసు నమోదైంది. ఆ పౌడర్‌ను విశ్లేషణ నిమిత్తం పంపారు. ఆరోపణలను సంస్థ ఖండించింది. ఇప్పటి వరకు అటువంటి ఆరోపణలు తమపై రాలేదని చెప్పింది.
టెలివిజన్ షోలో రామ్ దేవ్ బాబా సూచించిన మేరకు తాను ఆ పౌడర్ కొని వాడినట్లు నరుపులా చెబుతున్నారు. ఆ మందు వాడిన తర్వాత తాను ఆహారం మింగలేని పరిస్థితి ఏర్పడిందని, మాట్లాడలేకపోయానని, మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడు తీవ్రమైన నొప్పి రావడం ప్రారంభమైందని ఆమె చెప్పింది. దాంతో ఆమెను భర్త జనరల్ ఫిజిషియన్ వద్దకు తీసుకుని వెళ్లాడు. తాము ఎండోస్కోపీ చేయాల్సి వచ్చిందని వైద్యులు చెప్పారు. అన్నవాహికలో తిష్టవేసిన పదార్థాన్ని వివిధ మార్గాల్లో తీసేయడానికి ప్రయత్నించామని, కానీ ఫలితం లేకపోయిందని, దాంతో శస్త్ర చికిత్స చేశామని వారు చెప్పారు. తమపై వచ్చిన ఆరోపణలను షాపు యజమాని పున్నాలాల్ గుప్తా ఖండించారు. ఇప్పటి వరకు తమపై ఇటువంటి ఆరోపణలు రాలేదని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications