కేంద్ర మంత్రివర్గంలోకి చిరంజీవి, ఉప ప్రధానిగా ప్రణబ్ ముఖర్జీ

Chiranjeevi
న్యూఢిల్లీ‌: కేంద్ర మంత్రివర్గంలో రాష్ట్రానికి చెందిన ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవికి, కావూరి సాంబశివ రావుకి అవకాశం దక్కవచ్చునని ప్రచారం జరుగుతోంది. ఐదు రాష్ట్రాల ఉప ఎన్నికలు ముగియడంతో కేంద్ర మంత్రివర్గాన్ని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ జూన్ మొదటివారంలో విస్తరించే అవకాశాలున్నాయి. కొందరికి ఉద్వాసన పలికి, కొందరి శాఖలను మార్చే అవకాశాలున్నట్లు కూడా చెబుతున్నారు. ప్రణబ్ ముఖర్జీని ఉప ప్రధానిగా నియమిస్తారని అంటున్నారు. ప్రస్తుత ఆరోగ్య శాఖ మంత్రి గులాం నబీ ఆజాద్‌కు పూర్తిగా పార్టీ బాధ్యతలు అప్పగించే ఆలోచనలో ఉన్నారు.

హోం శాఖ నుంచి పి. చిదంబరాన్ని తప్పించవచ్చునని అంటున్నారు. ఎస్ జైపాల్ రెడ్డి శాఖ మారే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఆరోపణలు ఎదుర్కుంటున్న మంత్రులకు ప్రధాని ఉద్వాసన పలికే అవకాశాలున్నాయి. దిగ్విజయ్ సింగ్‌ను మంత్రివర్గంలోకి తీసుకుంటారని అంటున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి పదవి చేపట్టే తృణమూల్ కాంగ్రెసు నేత, రైల్వే మంత్రి మమతా బెనర్జీ స్థానంలో అదే పార్టీకి చెందిన ముకుల్ రాయ్‌ని నియమిస్తారని అంటున్నారు. మమతా బెనర్జీ స్థానంలో తృణమూల్‌కు మరో మంత్రి పదవి దక్కుతుంది.

డిఎంకెకు చెందిన అళగిరికి స్థానచలనం తప్పదని అంటున్నారు. అందుకు డిఎంకె అధినేత కరుణానిధి ఇష్టపడకపోతే పరిస్థితి మారే అవకాశాలున్నాయి. మంత్రివర్గంలో చేరాలని డిఎంకెపై ఒత్తిడి చేయకూడదని కాంగ్రెసు అధిష్టానం భావిస్తోంది. డిఎంకె తప్పుకుంటే వెంటనే జయలలిత నాయకత్వంలోని అన్నాడియంకె ప్రభుత్వంలో చేరే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+