గులాం నబీ ఆజాద్‌తో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యతిరేకుల భేటీ

పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, కుతూహలమ్మ బహిరంగంగానే ముఖ్యమంత్రిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం వల్ల సొంత జిల్లావాళ్లే సంతోషించడం లేదని, రాష్ట్ర ప్రజలు ఎలా సంతోషిస్తారని కుతూహలమ్మ అన్నారు. ముఖ్యమంత్రికి ప్లాన్ లేదు, యాక్షన్ లేదని వ్యాఖ్యానించారు. కిరణ్ కుమార్ రెడ్డి సంగతి తాను చూస్తానని, ఆయనను వ్యతిరేకిస్తానని పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. షాజహాన్, రవి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌తో వెళ్లడానికి సిద్ధపడ్డారు. రవి చిత్తూరు జిల్లాకు మంత్రి మంత్రి గల్లా అరుణకుమారి పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.












Click it and Unblock the Notifications