నేను జగన్‌కు అనుకూలమనడం సీమాంధ్రుల కుట్ర: నాగం జనార్దన్ రెడ్డి

ఈ నెల 21వ తేదీన పరిగిలో తెలంగాణ నగారా సభ జరిగి తీరుతుందని తెలుగుదేశం శానససభ్యుడు హరీశ్వర్ రెడ్డి చెప్పారు. పార్టీ జెండా లేకుండానే ఈ సభను నిర్వహిస్తామని, పార్టీ జెండా లేకుండా సభ జరుగుతుందని ప్రకటించినందున వెనక్కి తగ్గలేమని ఆయన స్పష్టం చేశారు. ఈ సభకు అన్ని పార్టీలను, తెలంగాణ ప్రజా సంఘాలను, విద్యార్థులను ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు. పార్టీ జెండా పెడితే సభకు ఎవరూ రారని ఆయన అన్నారు. మంత్రి జూపల్లి కృష్ణా రావు చేస్తున్న పాదయాత్రకు ఎవరూ రాకపోవడాన్ని ఆయన గుర్తు చేశారు. పార్టీ జెండా లేకుండా పోరాడితేనే తెలంగాణ వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీ నిర్వహించే ఇతర కార్యక్రమాల్లో తాము పాల్గొంటామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications