నాగం జనార్దన్ రెడ్డి సొంత పార్టీ, టిడిపి నుంచి బహిష్కరణే తరువాయి?

అయితే, చంద్రబాబుకు అనుకూలంగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు, మోత్కుపల్లి నర్సింహులు వంటి నాయకులు మాత్రం పార్టీ జెండా పెట్టాల్సిందేనని వాదిస్తున్నారు. నాగం జనార్దన్ రెడ్డిని పార్టీ నుంచి తప్పించాలని వారు చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధపడ్డారు. ఆయనకు వ్యతిరేకంగా తెలంగాణ సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి తెలంగాణ సభలను నిర్వహించాలని కూడా ఆలోచిస్తున్నారు. అయితే, అది కార్యరూపం దాల్చడం లేదు. చంద్రబాబు జయలలిత ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనడానికి చెన్నై వెళ్లారు. దీంతో నాగం జనార్దన్ రెడ్డి వ్యతిరేకులు చంద్రబాబు వచ్చిన తర్వాత తమ కార్యాచరణకు ఊపునిచ్చే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది.
నాగం జనార్దన్ రెడ్డి పార్టీని స్థాపించి జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసుతో దోస్తీకి సిద్ధపడుతున్నట్లు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు చెక్ పెట్టేందుకు ఇదే సరైన మార్గమని కూడా ఆయన అనుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వ్యూహం కూడా ఖరారైనట్లు చెబుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ సభల్లో వాడుతున్న జెండానే పార్టీ జెండాగా స్వీకరించే అవకాశాలున్నాయి. పార్టీ నుంచి తనను బహిష్కరించిన వెంటనే తన వ్యూహాన్ని అమలు చేసేందుకు నాగం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. హరీశ్వర రెడ్డి, వేణుగోపాలాచారి, విజయరామారావు వంటి నాయకులు నాగం వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు అర్థమవుతోంది.












Click it and Unblock the Notifications