వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వేలానికి గాజువాక పోలీసు స్టేషన్: విశాఖపట్నం కోర్టు సంచలన తీర్పు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vishakapatnam
విశాఖపట్నం: గాజువాక పోలీసు స్టేషన్‌లోని వస్తువులన్నింటిని వేలానికి పెట్టాలని విశాఖపట్నం కోర్టు మంగళవారం సంచనల తీర్పును ఇచ్చింది. పోలీసు వాహనం రక్షక్ బాధితుడికి నష్ట పరిహారం చెల్లించేందుకు గాజువాక పోలీసు స్టేషన్‌లో ఉన్న కంప్యూటర్లు, ఫర్నిచర్, టీవీలు అమ్మకానికి పెట్టి బాధితుడుకు రూ. లక్షన్నరను వెంటనే చెల్లించాలని కోర్టు తీర్పు చెప్పింది. కాగా కేసు విషయానికి వస్తే 2006వ సంవత్సరంలో రక్షక్ వాహనం రాము అనే వ్యక్తిని ఢీకొంది. ఈ ప్రమాదంలో రాము కాళ్లు, చేతులు కోల్పోయాడు. తనకు ఎలాంటి నష్టపరిహారాన్ని పోలీసులు చెల్లించక పోవడంతో రాము కోర్టులో కేసు పెట్టాడు. అయితే 2010లో కోర్టు రాముకు రూ.లక్షన్నరను నష్టపరిహారంగా అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది.

అయితే పోలీసులు ఆ విషయాన్ని నిర్లక్ష్యంగా తీసుకున్నారు. దీంతో రాము మరోసారి కోర్టుకు వెళ్లారు. దీంతో కోర్టు మంగళవారం రాముకు రూ.లక్షన్నర ఇవ్వాలని, లేనిచో పోలీసు స్టేషన్‌లో ఉన్న వస్తువులను అమ్మి నష్ట పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. కాగా ఈ కేసులో ప్రతివాదులుగా విశాఖ డిఐజి, ఐజి, హోంశాఖ సెక్రటరీ, గాజువాక పోలీసులను పేర్కొన్నారు. ఈ కేసులో ప్రత్యక్షంగా స్పష్టమైన ఆధారాలు కూడా ఉన్నాయి. అంతేకాదు ఇప్పటి వరకు ప్రతివాదులు ఎవరూ కోర్టుకు స్వయంగా హాజరు కాలేదు. కోర్టు నోటీసులు ఇస్తే మాత్రం తీసుకున్నారంట.

English summary
Vishaka court gave variety justice today that to sale Gajuwaka police station for victim Ramu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X