పక్కా వ్యూహంతోనే రాజీనామా చేయడం లేదు: సబ్బం హరి

ప్రజల కోసం ఇంతలా శ్రమించే నాయకున్ని తాను ఇంత వరకు చూడలేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రంలోని ప్రతి వర్గానికి ప్రాధాన్యత ఇచ్చారన్నారు. రాష్ట్రంలో వైయస్ లాంటి పాలన కేవలం జగన్ వల్లనే సాధ్యం అని చెప్పారు. జగన్ వెంట వెళ్లడానికి తాము రాజీనామాలకు కూడా సిద్ధమని ప్రకటించారు. కాంగ్రెసు ప్రభుత్వం రాష్ట్రంలో, దేశంలో అధికారంలో ఉందని అయినప్పటికీ రైతుల సమస్యలు తీరడం లేదన్నారు. కాంగ్రెసు తమకు ఎంపీ పదవి కంటే మరెంతో పెద్ద పదవిని ఇచ్చే అవకాశం లేదన్నారు. జగన్ కోసం అలాంటి పదవిని వదులుకోవడానికి సిద్ధం అని చెప్పారు. ప్రజలు ఎక్కడ ఉంటే నాయకులు అక్కడే ఉంటారని, ఇప్పుడు ప్రజలు జగన్ వెంట ఉన్నారు కాబట్టి తాము జగన్ వెంట వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.












Click it and Unblock the Notifications